: వాళ్ల ఇష్టం ...వాళ్లు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి: నాగార్జున
జనవరిలో నిశ్చితార్థం చేసుకుంటానన్నాడు, వాడి ఇష్ట ప్రకారమే చేశాము, పెళ్లి విషయంలోనూ అంతే. నాగ చైతన్య, సమంతలు ఎక్కడ, ఎప్పుడు వివాహం చేసుకుంటామన్నా తాము సిద్ధమేనని అక్కినేని నాగార్జున చెప్పారు. ఆయన నటించిన ‘ఓం నమో వేంకటేశాయ’ విశేషాలతో పాటు తమ ఇంట్లో పెళ్లి ముచ్చట్ల గురించి నాగార్జున చెప్పుకొచ్చారు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నాగ చైతన్య, సమంతలు పెళ్లి ఎప్పుడు చేసుకుంటామంటే అప్పుడేనని అన్నారు. త్వరలో విడుదల కానున్న ఓం నమో వేంకటేశాయ చిత్రం గురించి ప్రస్తావిస్తూ, వెంకటేశ్వరుడి భక్తుడు అయిన హాథీరాం బావాజీ గురించి ఎక్కువగా తెలియదని, ఆయన గురించి తెలుసుకోవడానికి దేశ వ్యాప్తంగా ఉన్న మఠాలన్నీ చిత్ర బృందం తిరిగిందని చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు, వెంకటేశ్వరుడి పాత్రధారికి మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు.