: బాలయ్య బంధువైనందునే మినహాయింపు ఇచ్చారు: హైకోర్టులో పిటిషనర్ వాదన


టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తన వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణకు బంధువైనందునే ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారని వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ప్రొసీడింగ్స్ లేకుండా జీవో జారీ చేయడంపై మండిపడింది. దీంతో ఈ సినిమాకు ప్రభుత్వం కల్పించిన పన్ను మినహాయింపు జీవోను 14ను రద్దు చేస్తామని, మరో రెండు రోజుల్లో కొత్త జీవో ఇస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News