: ఎప్పటికీ రాజకీయాల్లోకి రానంటున్న బాలీవుడ్ టాప్ హీరో!
తన జీవితంలో ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తెలిపాడు. ముంబైలో 'రయీస్' సక్సెస్ మీట్ లో మాట్లాడిన షారూఖ్... తాను కేవలం నటుడినేనని, రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశాడు. జీవితాంతం నటిస్తూనే ఉంటానని ఆయన చెప్పాడు. తనకు రాజకీయాల గురించి తెలియదని, అలాగే రాజకీయాలపై ఆసక్తి కూడా లేదని తెలిపాడు. అలాగే 'కాబిల్' వివాదంపై మాట్లాడుతూ, బాలీవుడ్ లో ప్రతి సినిమాకు స్థానం ఉంటుందని, అలాగే బిజినెస్ కూడా జరుగుతుందని అన్నాడు. ఏ సినిమా కూడా మరో సినిమాకు పోటీ కాదని, అలాగే బిజినెస్ ను కూడా దెబ్బతీయదని చెప్పాడు. అయితే 'రయీస్' తాము ఊహించినదాని కంటే కూడా ఎక్కువ వసూళ్లు సాధించిందని షారూఖ్ తెలిపాడు.