: దొంగ గారి పెళ్లి... గజదొంగలే అతిథులు.. షాక్ తిన్న నిఘా పోలీసులు!


ఓ చైన్ స్నాచర్ పెళ్లిపై నిఘా ఉంచిన పోలీసులు ఆ పెళ్లికి వచ్చిన అతిధులను చూసి షాక్ తిన్న ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... థానేలోని అంబ్విలి ప్రాంతంలో తౌఫిక్ పేరు మోసిన దొంగ, చైన్ స్నాచర్. అతనిపై ఇప్పటి వరకు 25 కేసులున్నాయి. తన మేనత్త కూతురు సోహ్రా (15)ను తౌఫిక్ వివాహం చేసుకున్నాడు. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి 1000 మంది అతిథులు హాజరయ్యారు. చైన్ స్నాచర్, దొంగ కావడంతో అతని వివాహంపై 20 మంది పోలీసులు నిఘా ఉంచారు.

వీరంతా వచ్చిన అతిథులను చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, కరుడుగట్టిన దొంగలు, గజదొంగలుగా పేరు పడినవారు, ఎంతో కాలంగా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నవారు ఈ వివాహానికి హాజరయ్యారు. ఢిల్లీ, భోపాల్‌, అహ్మదాబాద్‌, కర్ణాటక, ముంబై ప్రాంతాల్లో వివిధ నేరాలకు పాల్పడేవారంతా ఈ వివాహానికి రావడంతో నిర్ఘాంతపోయిన పోలీసులు, వారిని అరెస్టు చేస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందన్న ఆలోచనతో వారిని అరెస్టు చేయలేదట. దీంతో ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News