: కోటి ఎకరాలు తడిపే వరకు విశ్రమించం: సీఎం కేసీఆర్


గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణలోని కోటి ఎకరాల భూమిని తడిపేంత వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ వస్తే ఏం వస్తుందని గతంలో కొంతమంది ఎద్దేవా చేశారని గుర్తు చేసిన ఆయన, తెలంగాణ రావడం వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు తొందరగా పూర్తవుతున్నాయని చెప్పారు.

మన ప్రాజెక్టులపై మన రాష్ట్ర నేతలే కోర్టుల్లో పిటిషన్‌లు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరునూరైనా తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని ఆయన స్పష్టం చేశారు. భక్తరామదాసు ప్రాజెక్టు ప్రారంభించిన సందర్భంగా పాలేరు రైతుల ముఖాల్లో సంతోషం ఉప్పొంగుతోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా త్వరలోనే సాగునీరందిస్తామని ఆయన ప్రకటించారు. ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులుగా మారిన వారికి మెరుగైన నష్ట పరిహారం ఇస్తున్నామని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News