: ప్రయాణికులతో కలసి విమానంలో ప్రయాణించిన 80 గద్దలు!


మిడిల్ ఈస్ట్ లో పక్షుల కోసం విమానాలు బుక్ చేస్తుండటం సాధారణంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో గద్దల కోసం సౌదీ అరేబియా యువరాజు ఒక విమానంలో సీట్లు బుక్ చేశాడు. దీంతో సాధారణ ప్రయాణికులతో పాటు 80 గద్దలు కూడా కలిసి ప్రయాణించాయి. 80 గద్దలకు విమాన టిక్కెట్ల ఖర్చును సౌదీ యువరాజు భరించారు. ఒక్కో గద్దకు ఒక్కో సీటుతో పాటు ఫ్లైట్ లో అందించే మీల్స్ ను వాటికి అందించడం విశేషం. ఎనభై గద్దలను ఆయా సీట్ల వద్ద కట్టి వేశారు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటోను రెడిట్ వెబ్ సైట్ యూజర్ లెన్సూ పోస్ట్ చేశాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సదరు యూజర్ పేర్కొనలేదు. కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) జాతీయ పక్షి గద్ద. ఈ విధంగా గద్దలు విమానాల్లో ప్రయాణించడం అక్కడ కొత్తేమీ కాదు. ఇందుకుగాను, కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రత్యేక నిబంధనలు, ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. గద్దలను తమ విమానాల్లో తీసుకు వెళ్తామని ఈ సందర్భంగా ఎతిహాద్ ఎయిర్ వేస్ సంస్థ అధికారిక వెబ్ సైట్ పేర్కొంది. ఎకానమీ క్లాసులో గరిష్ఠంగా ఆరు గద్దలకు తాము అనుమతిస్తామని ఖతార్ ఎయిర్ వేస్ సంస్థ పేర్కొనగా, గద్దలకూ పాస్ పోర్టులు ఉండాలని, వాటిని ఇమ్మిగ్రేషన్ లో ధ్రువీకరిస్తామని ఎమిరేట్స్ఉమన్.కామ్ పేర్కొంది. 

  • Loading...

More Telugu News