: సైనిక స్థావరాల వద్ద ఐసిస్ లేఖలు, జెండాలు.. బాంబులతో విరుచుకుపడతామంటూ గోడలపై రాతలు.. ముష్కరులు మన దేశంలోకి అడుగుపెట్టారా?


మన సైనిక స్థావరాల వద్ద ఐసిస్ లేఖలు ప్రత్యక్షమవడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ లేఖలు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉన్నాయి. ఈ లేఖల్లో ఐఎస్ఐఎస్ జారీ చేసిన ఫత్వాలను పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కంటోన్మెంట్ లో అయిదు ప్రదేశాల్లోని గోడలపై ఈ లేఖలను అతికించారు. అంతేకాదు ఐసిస్ జిందాబాద్ అంటూ రాసి ఉన్న రెండు జెండాలను కూడా పాతారు. గోడలపై నల్లరంగు స్ప్రేతో ఐసిస్ నినాదాలు రాశారు. బాంబులతో విరుచుకుపడతామంటూ కంటోన్మెంట్ లోని గూర్ఖా శిక్షణ కేంద్రం గోడపై, ఓ పార్క్ గేటుపై రాశారు. ఐసిస్ ముష్కరుల చొరబాటును ఇవి సూచిస్తున్నాయని పలువురు అంచనా వేస్తున్నారు. సైన్యం, పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News