: దాసరికి ఆపరేషన్... ఆయన అనారోగ్య సమస్యలను వివరించిన డాక్టర్లు!
ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్య సమస్యలతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాసకోశ సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. అంతేకాదు ఆయన కిడ్నీలకు ఇన్ఫెక్షన్ సోకింది. వెంటిలేటర్ పై దాసరికి చికిత్స అందిస్తున్నారు. దీనికితోడు, డయాలసిస్ కూడా చేస్తున్నారు. ఈ వివరాలను కిమ్స్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు వెల్లడించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ను నియంత్రించడానికి ఛాతీ భాగంలో ఆపరేషన్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు.