: వందల కోట్లు దోచుకోవాలని చూసిన ఆ ఇద్దరు మంత్రులను బర్తరఫ్ చేయాలి: వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్ నాథ్


విశాఖపట్టణంలో అసైన్డ్ భూముల యజమానులను బెదిరించి వందల కోట్లు దోచుకోవాలని మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు ప్రయత్నించారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. ఇద్దరు మంత్రులను ఏపీ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేదల భూములు ఏ విధంగా లాక్కోవాలనే ఉద్దేశంతోనే ఎంవోయూలు జరుగుతున్నాయని,  పార్టనర్ షిప్ సమ్మిట్ లను విశాఖ నేతలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు దోపిడీలో సీఎం చంద్రబాబు వాటా ఎంతో బయటపెట్టాలని, తమ పార్టీ అధికారంలోకి రాగానే భూ దందాపై విచారణ జరుపుతామని, దోషులందరినీ బోనులో నిలబెడతామని అన్నారు. 

  • Loading...

More Telugu News