: ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి సోనియాగాంధీ దూరం


ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రాకుండా చూడాలనే ఏకైక లక్ష్యంతో చేతులు కలిపిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమికి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదనే విధంగా ఆమె కార్యాలయం నుంచి సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీకి పెద్ద దిక్కు అయిన ములాయం సింగ్ యాదవ్ తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయనని తేల్చి చెప్పేశారు. ఆయన వ్యాఖ్యలతో ఎస్పీ, కాంగ్రెస్ కూటమి షాక్ కు గురయింది. ఇప్పుడు తాజాగా సోనియాగాంధీ కూడా ప్రచారం చేయబోరనే సంకేతాలు వెలువడటంతో, భారీ షాక్ తగిలింది. అనారోగ్య కారణాల వల్లే సోనియాగాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. తరచుగా అనారోగ్యానికి గురవుతున్న సోనియాగాంధీ... గత ఏడాది అమెరికాలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News