: భారత్ కూడా ట్రంప్ మాదిరే వ్యవహరించాలి: యోగి ఆదిత్యనాథ్


అమెరికాలోకి వస్తున్న వలసవాదులపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ట్రంప్ జారీ చేసిన ఇమిగ్రేషన్ ఆర్డర్లపై పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం ట్రంప్ చర్యలను సమర్థించారు. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైనదని అభిప్రాయపడ్డారు. టెర్రరిజాన్ని అడ్డుకోవాలంటే భారత్ కూడా ట్రంప్ తరహాలోనే వ్యవహరించాలని అన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని పరిస్థితులు కశ్మీర్ ను తలపిస్తున్నాయని ఆయన తెలిపారు. 1990లలో కశ్మీర్ లో ఏం జరిగిందో... ప్రస్తుతం యూపీలో అదే జరుగుతోందని అన్నారు. ఈ పరిస్థితులను బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనీయదని చెప్పారు. కశ్మీర్ లోయను మనం కోల్పోయామని, కానీ ఉత్తరప్రదేశ్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను వదులుకోబోమని తెలిపారు.  

  • Loading...

More Telugu News