: సిరీస్ ఎవరిదో డిసైడ్ చేసే చివరి టీ-20లో ఈ మార్పులు చేయండి: గంగూలీ సూచన
రెండు రోజుల క్రితం నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచినప్పటికీ బౌలర్లు బుమ్రా, ఆశీష్ నెహ్రా రాణించడంతో ఐదు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. మరోవైపు సిరీస్ ఎవరిదో డిసైడ్ చేసే చివరి టీ-20లో టీమిండియాలో బ్యాటింగ్ లైనప్‌పై ప్రయోగాలు చేయకతప్పదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ప్రధానంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మహేంద్రసింగ్ ధోనీని ముందుగానే దించాలని ఆయన అన్నారు.
అలాగే, నంబర్ 3 స్థానంలో మనీష్ పాండేను ఆడించాలని, మిగిలి ఉన్న ఓవర్లను బట్టి రైనాను ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే సరిపోతుందని గంగూలీ చెప్పారు. ఈ విషయాన్ని తాను గత నాలుగైదేళ్లుగా చెబుతున్నానని అన్నారు. ఇప్పుడు ధోనీ చాలా స్వేచ్ఛగా, అత్యుత్తమంగా ఆడుతున్నాడని, ఇక ఆయనను ముందుగానే క్రీజులోకి పంపడం మంచిదని తెలిపారు.