: మా డబ్బులతో మీ సోకులా?: చంద్రబాబుపై బీజేపీ నేత సోము వీర్రాజు నిప్పులు
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను అనుభవిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రం నిధులివ్వలేదని ఆరోపించడం సబబు కాదని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలనే టీడీపీ సర్కారు తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని అన్నారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా తమ ప్రభుత్వం సహకరిస్తున్నా, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రం సోకులకు పోతోందని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ఇస్తున్న నిధులపై వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు.