: ఒకే వేదికపై నాగచైతన్య తల్లి లక్ష్మి, తండ్రి నాగార్జున!


యువ హీరో నాగచైతన్య, నటి సమంతల నిశ్చితార్థం హైదరాబాదులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఒక అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. చాలా కాలం తర్వాత చైతూ తల్లి లక్ష్మి, తండ్రి నాగార్జునలు ఒకే వేదికపై కనిపించారు. అయితే వీరు వారి వారి భాగస్వాములతోనే ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు. అమలను పెళ్లి చేసుకోవడానికి ముందు దివంగత సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని నాగార్జున పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి చైతూ పుట్టాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల లక్ష్మి, నాగార్జునలు విడిపోయారు.తాజాగా చైతూ, సమంతల నిశ్చితార్థానికి అందరూ తరలి వచ్చారు. ఏనాడూ బయట కనిపించని హీరో వెంకటేష్ భార్య నీరజ, కుమార్తెలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైతూ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. కొత్త జీవితానికి ఇది ఒక గొప్ప ప్రారంభమని ట్వీట్ చేశాడు. మరుపులేని రాత్రి అని... ఇంత సంతోషానికి కారణమైన సమంతకు ధన్యవాదాలు తెలిపాడు. 

  • Loading...

More Telugu News