: డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన 2000 మంది గూగుల్ ఉద్యోగులు


ఏడు ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులు, ఇస్లామిక్‌ ఉగ్రవాదులు త‌మ దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును నిరసిస్తూ 2000 మందికి పైగా గూగుల్ ఉద్యోగులు రోడ్డుపైకి వ‌చ్చి ఆందోళ‌న తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ కు వ్యతిరేకంగా వారంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రంప్ ఆదేశాలను కాద‌నేలా గూగుల్‌ 4 మిలియన్ డాలర్ల సంక్షోభ నిధిని వలసదారుల సమస్యల కోసం సమీకరించిన విష‌యం తెలిసిందే. అమెరికా వ్యాప్తంగా ఉన్న గూగుల్ క్యాంపస్‌లు ఈ ఆందోళ‌న‌కు మద్దతు తెలుపుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా గూగుల్ సీఈవో, భార‌త సంత‌తికి చెందిన‌ సుందర్ పిచాయ్, సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ మౌంటేన్ వ్యూ   ర్యాలీలో ప్రసంగించారు. ర్యాలీలో పాల్గొన్న త‌మ ఉద్యోగులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపి, ట్రంప్ తీరుపై ఈ యుద్ధాన్ని ఇలానే కొనసాగించాలని, రాజీ పడకూడదని వ్యాఖ్యానించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 187 మంది గూగుల్ ఉద్యోగులపై ప్రభావం ప‌డనున్న నేప‌థ్యంలో వారికి సాయం అందేలా కంపెనీ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తోంది.

  • Loading...

More Telugu News