: విజయవాడలో తోటి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన విదేశీ విద్యార్థి
ఉన్నత విద్య అభ్యసించేందుకు సూడాన్ నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థులు గొడవపడడంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విదేశం నుంచి వచ్చిన విద్యార్థుల మధ్య చెలరేగిన చిన్న వివాదం పెరిగి పెద్దదై అందరూ కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో సూడాన్‌కు చెందిన బీఫార్మసీ ఫస్టియర్ విద్యార్థి మహ్మద్ మైతోబ్‌ను సహ విద్యార్థి మహ్మద్ అల్లాదీన్ కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలయిన మైతోబ్ ప్రాణాలు కోల్పోయాడు. వీరిద్దరూ నిన్న రాత్రి మద్యం సేవించి ఒకరిపై ఒకరు దాడికి దిగినట్లు తెలుస్తోంది. విదేశీ విద్యార్థులు గొడవలు పడుతున్న ఘటనలు పెరిగిపోతుండడంతో సదరు కాలేజీ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది.