: జోడు గుర్రాల బగ్గీ ఎక్కిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండగా, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటుకు వచ్చారు. సంప్రదాయ అశ్విక దళం వెన్నంటి రాగా, జోడు గుర్రాల బగ్గీపై ప్రణబ్ ప్రయాణం రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ వరకూ సాగింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ వద్దకు వచ్చిన ప్రణబ్ కు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. పలువురు నేతలకు ఆయన అభివందనం చేస్తూ లోపలకి సాగారు. మరికాసేపట్లో సభ్యులను ఉద్దేశించి ప్రణబ్ ప్రసంగించనున్నారు.