: బొండా ఉమకు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు... రూ. 500 నోట్ల దండేసిన తెలుగుదేశం నేతలు
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ జన్మదిన వేడుకలు వైభవంగా సాగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా కేక్ కట్ చేయించి, ఉమకు తినిపించి శుభాభినందనలు తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగా, ఆయన ఇంటివద్ద జరిగిన వేడుకల్లో తెలుగుదేశం నేతలు ఏకంగా రూ. 500 కొత్త నోట్లతో తయారు చేయించిన భారీ దండతో ఆయన్ను అలంకరించి ముచ్చట తీర్చుకున్నారు. రూ. 1.5 లక్షలను మాలగా కూర్చిన సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని కార్యకర్తలు, దాన్ని ఉమాకు అలంకరించారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచి పండగ చేసుకున్నారు.