: ట్రంప్ తో పెట్టుకుంటే అంతే మరి.. అత్యున్నత అధికారిపై వేటు!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వరూపం చూపిస్తున్నారు. తన మాటను ధిక్కరిస్తే, ఎంతటి వాడినైనా సహించనంటున్నారు. తాజాగా, ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి రానీయకుండా ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిషేధాజ్ఞల విషయంలో సహకరించడం లేదన్న కారణంతో అటార్నీ జనరల్ సలే యాట్స్ ను పదవి నుంచి తొలగించారు. అమెరికన్ల ప్రయోజనాల కోసం జారీ చేసిన ఉత్తర్వులను ఆమె సమర్థించకపోవడం విశ్వాసఘాతుకం అవుతుందని వైట్ హౌస్ అధికారులు నిన్న రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. అంతేకాదు, ఆమె స్థానంలో డనా బౌంటేను తాత్కాలిక అటార్నీ జనరల్ గా నియమించారు. నిన్న రాత్రే ఆయన ప్రమాణస్వీకారం చేశారు.

ఇస్లామిక్ దేశాల పౌరులను దేశంలోకి రానివ్వకుండా ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన తర్వాత... వీసాలు కలిగి ఉన్న వారిని దేశంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం కుదరదంటూ సలే యాట్స్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీంతో, ఆమెను పదవి నుంచి తప్పించింది వైట్ హౌస్.

  • Loading...

More Telugu News