: ఈ ప్రశ్నకు బదులేది జక్కన్నా? బాహుబలి - 2 పోస్టర్ లో తప్పును పట్టిన నెటిజన్లు!
విజువల్ వండర్ రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసిన రాజమౌళి చిత్ర రాజం 'బాహుబలి'కి కొనసాగింపుగా వస్తున్న 'బాహుబలి-2' పోస్టర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టరును నిశితంగా పరిశీలిస్తే, ఓ పెద్ద తప్పు దొర్లిందంటున్నారు నెటిజన్లు. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రతి ఒక్కరికీ ఈ తప్పు తెలిసిపోతుండటంతో నెట్టింట ఇదే పెద్ద చర్చగా మారింది. ఇంతకీ తప్పేంటంటే...
ఈ పోస్టరులో విల్లంబులు పట్టుకుని ముందు అనుష్క, ఆ వెనుక ప్రభాస్ వాటిని ఎక్కుపెట్టి ఉన్నారు. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే, వెనక ఉన్న ప్రభాస్ బాణాలు, అనుష్క విల్లుపై కనిపిస్తున్నాయి. ఇదెలా సాధ్యమన్నదే నెటిజన్ల సూటి ప్రశ్న. అసలు అనుష్క విల్లుపైకి ప్రభాస్ సంధిస్తున్న బాణాలు ఎలా వచ్చాయని ప్రశ్నలు సంధిస్తున్నారు. జక్కన్న టీమ్ ఈ చిన్న పొరపాటును గమనించలేదని కామెంట్స్ వస్తున్నాయి. ఇక దీనిపై జక్కన్న స్పందన ఇంకా రాలేదు. ఆ తప్పును మీరూ చూడవచ్చు. రౌండ్ మార్కులో ప్రభాస్ చేతిలోని బాణాలు అనుష్క విల్లుపై నుంచి కనిపిస్తున్నాయి కదా? అదీ సంగతి.