: హోటల్ వెయిటర్ మాటనూ తేలికగా తీసుకోని సచిన్ టెండూల్కర్!
పాన్ షాపులో కూర్చునే చిరు వ్యాపారైనా, ఓ పెద్ద కంపెనీని నడుపుతున్న సీఈఓ అయినా, ఎవరు సలహా ఇచ్చినా వాటిని సహృదయంతో స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పిన సచిన్, గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గురించి వివరించారు. ఓ హోటల్ వెయిటర్ తనకు ఇచ్చిన సలహా గురించి గుర్తు చేసుకున్నారు. "చెన్నైలో ఓసారి నేను హోటల్ లో ఉన్న వేళ, ఒక వెయిటర్ వచ్చి, 'మీరు ఏమీ అనుకోనంటే, ఓ విషయం చెబుతాను. మీ మోచేతి గార్డు వల్ల బ్యాటు ఊపు దెబ్బతింటోంది. బంతి ఎక్కువ దూరం వెళ్లడం లేదు' అని చెప్పారు. అతను చెప్పిన విషయం నూటికి నూరు శాతం నిజమని నాకు అనిపించింది. అప్పటికే మోచేతి గార్డుతో నేను అసౌకర్యంగా ఫీలవుతున్నాను. ఆ వెయిటర్ సలహా మేరకు మోచేతి గార్డును మార్చుకున్నాను. సలహాలు పాటించడం నేర్చుకుంటే మరింత ముందడుగు వేయవచ్చు" అని చెప్పారు సచిన్.