: రూ.29.3 కోట్లకు అమ్ముడైన భారతీయ కళాఖండం.. దేశంలో ఇదే రికార్డు
నైరూప్యకళ(అబ్సాట్రాక్ట్ ఆర్ట్)లో సిద్ధహస్తుడైన భారతీయ చిత్రకారుడు వీఎస్ గైటొండే వేసిన ఆయిల్ కాన్వాస్ చిత్రం రూ.29.3 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఓ చిత్రం ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం దేశంలోనే ఇది తొలిసారి. గతేడాది డిసెంబరులో ముంబైలో క్రిస్టీ అనే సంస్థ నిర్వహించిన వేలంలో 55.25 అంగుళాల పొడవు, 40.12 అడుగుల వెడల్పు ఉన్న ఈ చిత్రాన్ని ఓ వ్యక్తి రూ.29.3 కోట్లకు కొనుగోలు చేసినట్టు సంస్థ తాజాగా వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు దేశంలో టాప్ 500 కళాఖండాలు మొత్తం రూ.1936.60 కోట్లకు అమ్ముడుపోయినట్టు ఆర్టరీ ఇండియా అనే కంపెనీ తెలిపింది.