: సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో అగ్నిప్రమాదం.. రెండు స్కూలు బస్సులు దగ్ధం
సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ప్రైవేటు స్కూలు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు బస్సులకు నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.