: త్వరలో పాకిస్థాన్‌పైనా నిషేధం.. సంకేతాలిచ్చిన ట్రంప్ సర్కారు
సిరియా శరణార్థులు సహా ఇరాక్, ఇరాన్, లిబియా, సూడాన్, సోమాలియా, యెమన్ దేశాలపై 90 రోజులపాటు ట్రావెల్ బ్యాన్ విధించిన అమెరికా కన్ను ఇప్పుడు పాకిస్థాన్‌పై పడింది. వలసల నిషేధం విధించిన ముస్లిం మెజారిటీ దేశాల జాబితాలో ఆ దేశాన్ని కూడా చేర్చేందుకు అగ్రరాజ్యం సమాయత్తమవుతోంది. భవిష్యత్తులో పాకిస్థాన్ పేరును కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉన్నట్టు ట్రంప్ యంత్రాంగం సంకేతాలిచ్చింది. చర్యలు తీసుకునే విషయంలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉందని వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రీబస్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ నిర్ణయంపై ఓవైపు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా మరోవైపు దేశంలోకి ప్రవేశించే విదేశీయులపై మరికొన్ని షరతులు కూడా విధించే అంశాన్ని ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.