: బార్‌లో తాగి గొడవపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడు.. బెంగళూరులో బుల్లితెర నటిపై దాడికి యత్నం
బెంగళూరులోని ఓ బార్‌లో జరిగిన గొడవలో ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఒకరు బుల్లితెర నటిపై దాడికి యత్నించాడు. దాడి ఘటనపై నటి స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యూబీ సిటీ 17వ అంతస్తులోని స్కైబార్‌లో ఆదివారం రాత్రి ఏడుగురు స్నేహితుల బృందం మధ్య చిన్న ఘర్షణ మొదలైంది. అది క్రమంగా పెరిగి ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకున్నారు. వీరిలో బుల్లితెర నటి నిరూషా కూడా ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం.
ఈ దశలో పీకలదాకా తాగిన పారిశ్రామికవేత్త కుమారుడు దర్శన్ నిరూషాపై దాడికి యత్నించాడు. దీంతో స్నేహితులతో కలిసి కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నిరూషా ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే మత్తు దిగిన దర్శన్ చేసిన తప్పుకు క్షమించాలని కోరుతూ నిరూషాకు లేఖ రాయడంతో కథ అక్కడితో ముగిసింది. చేసిన ఫిర్యాదును నిరూషా వెనక్కి తీసుకుంది.