: ముస్లిం దేశాల‌పై ఆంక్ష‌లు స‌బ‌బే... ట్రంప్‌ను వెన‌కేసుకొచ్చిన పోలండ్‌!


ముస్లిం దేశాల‌పై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ విధించిన ఆంక్ష‌ల‌పై ప్ర‌పంచ దేశాలు మండిప‌డుతుంటే పోలండ్ మాత్రం స‌మ‌ర్థించింది. ట్రంప్ చ‌ర్య స‌రైన‌దేనంటూ పోలండ్ ఆర్థిక మంత్రి విటోల్డ్‌ బాస‌ట‌గా నిలిచారు. త‌మ దేశంలోకి వ‌చ్చే ముస్లింల‌పై ఆంక్ష‌లు విధించే అధికారం ట్రంప్‌కు ఉంద‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు స్వ‌యంగా సౌదీరాజు సాల్మ‌న్ కూడా ట్రంప్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించ‌డం విశేషం. అంత‌ర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియా, యెమ‌న్‌లోని శ‌ర‌ణార్థుల‌కు ఆశ్ర‌యం క‌ల్పించే సుర‌క్షిత ప్రాంతాల‌ను ఏర్పాటు చేసి, వాటికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌న్న ట్రంప్ నిర్ణ‌యానికి సాల్మ‌న్ మ‌ద్ద‌తిచ్చారు. శ‌ర‌ణార్థుల‌కు ప‌సిఫిక్ దీవుల్లో ఆశ్ర‌యం క‌ల్పించేందుకు ట్రంప్ అంగీక‌రించిన‌ట్టు ఆస్ట్రేలియా ప్ర‌ధాని ట‌ర్న్‌బుల్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఖ‌ర్చుల‌ను తామే భ‌రిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News