: కశ్మీర్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఇంటర్నెట్ సేవలు


కశ్మీర్‌ లో నేటి అర్ధరాత్రి నుంచి ప్రీపెయిడ్‌ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2016 జూలైన 8న బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు కశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అనంతరం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్న దశలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని టెలికాం సంస్థలు నిర్ణయించాయి. కాగా, కశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన ప్రతిసారి సెల్ టవర్స్ ముట్టడి జరుగుతోంది. దీంతో టెలికాం సంస్థలు సేవలు నిలిపేసి నష్టాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ నేఫథ్యంలో టెలికాం సేవలు అందుబాటులోకి రానుండడంతో అక్కడి యువతలో సంతోషం నెలకొంది. 

  • Loading...

More Telugu News