: ఎన్నికల సిత్రాలు: తప్పులుంటే క్షమించండంటూ షూ తో కొట్టుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి!
ఉత్తరప్రదేశ్ లోని బులందర్ షహర్ లో ఓ ఎమ్మెల్యే అభ్యర్థి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ తరపున అఖిలేష్ వర్గం అభ్యర్థిగా షుజాత్ అలామ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బులందర్ షహర్ కు వెళ్లారు. ప్రజలను ఓట్లు వేయాలని కోరిన ఆయన, ‘తెలిసో, తెలియకో తప్పులు చేసి ఉంటే క్షమించండి’ అంటూ తన షూతో తన నెత్తిపై కొట్టుకుని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
అయితే, తాను ఏం తప్పులు చేశారనే వివరాలను మాత్రం ఆయన ప్రస్తావించలేదు. కాగా, షుజాత్ అలామ్ వృత్తి రీత్యా లాయర్. గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి మళ్లీ బరిలో నిలిచారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి హజీ అలీమ్ పై షుజాత్ అలామ్ పోటీ పడుతున్నారు.