: నాన్న ప్రచారం చేస్తారు: అఖిలేష్ విశ్వాసం


తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తును అంగీకరించని ములాయం సింగ్ యాదవ్ తాను ఎన్నికల ప్రచారంలో పార్టీ తరపున పాల్గొననని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అఖిలేష్ మాట్లాడుతూ, తమ కూటమికి మద్దతుగా తన తండ్రి ములాయం త్వరలోనే ప్రచారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒంటరిగా పోటీచేసి గెలిచే అవకాశమున్నప్పటికీ పొత్తు ద్వారా రాష్ట్రంలో మరింత బలంగా అవతరించాలని పొత్తుకు ఇద్దరమూ అంగీకరించామని అఖిలేష్ తెలిపాడు. 

  • Loading...

More Telugu News