: తిరుమల కిడ్నాపర్ దొరికాడు....బాలిక సేఫ్!


నిన్న ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం, సాధారణ వసతి గృహంలో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లిపోయిన కిడ్నాపర్ దొరికాడు. మహబూబ్ నగర్ బస్సులో బాలిక నవ్యశ్రీని తరలిస్తుండగా ప్రయాణికులు కిడ్నాపర్ ను గుర్తుపట్టి పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్ ను బాలస్వామిగా గుర్తించారు. కాగా, నిన్న కిడ్నాప్ కు గురైన నవ్యశ్రీ గురించి టీవీ ఛానెళ్లలో విరివిగా కథనాలు రావడంతో ఆ పాపను గుర్తించిన ప్రయాణికులు అతనిని పట్టుకున్నారు. తనకు పిల్లలు లేకపోవడంతో పెంచుకోవాలన్న ఉద్దేశంతోనే బాలికను ఎత్తుకెళ్లానని పోలీసులకు బాలస్వామి తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. కిడ్నాపర్ ను గుర్తించిన ప్రయాణికులకు నవ్యశ్రీ తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. 

  • Loading...

More Telugu News