: రూ.500 తీసుకుంటారనేది తెలిసిందే.. ఓట్లు మాత్రం బీజేపీకే వేయండి: పారికర్


గోవాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి, బీజేపీ నేత మనోహర్ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనాజీలోని చింబల్ ప్రాంతంలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లే వారు రూ. 500 తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందేనని, అదేం ఇబ్బందికరమైన విషయం కాదని, ఓటు వేసేటప్పుడు మాత్రం బీజేపీకి మాత్రమే ఓటు వేయాలని, ఈ విషయాన్ని మర్చిపోవద్దని పారికర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్   గోవా ఎన్నికల ప్రచారంలో ‘డబ్బులు తీసుకోండి.. ఎన్నికల కమిషన్ లంచాలను ప్రోత్సహిస్తోంది..’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం, దీంతో కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయాలని గోవా ఎన్నికల ప్రధాన అధికారిని ఈసీ ఆదేశించడం విదితమే. 

  • Loading...

More Telugu News