: చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన అమరావతి వాసులు!
అమరావతి రాజధాని ప్రజలకు ఉచిత హెల్త్ కార్డులను సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ పంపిణీ చేశారు. రాజధాని పరిధిలోని 27 గ్రామాలకు చెందిన 28,044 కార్డుల పంపిణీ జరిగింది. 2014 డిసెంబర్ 8 నాటికి ఆ ప్రాంతంలో నివాసం వున్న వారందరినీ అర్హులుగా గుర్తించామని, ఈ కార్డు ద్వారా 305 రిఫెరల్ ఆసుపత్రుల్లో ఉన్నత స్థాయి చికిత్స పొందవచ్చన్నారు. కాగా, ఉచిత హెల్త్ కార్డులు పొందిన రాజధాని గ్రామాల వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు తమ కృతఙ్ఞతలు తెలిపారు. రాజధాని నిర్మాణం నిమిత్తం తమ భూములను ఇచ్చామని, అన్ని విధాలా ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్తులు కోరారు.