: అంపైర్ షంషుద్దీన్ పై ఫిర్యాదు చేయనున్న ఇంగ్లండ్ జట్టు


నాగ్ పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో జరిగిన రెండు తప్పిదాలే తమ నుంచి విజయాన్ని వేరు చేశాయని ఇంగ్లండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అంపైర్ షంషుద్దీన్ పై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. రెండో టీ20లో ఐదో ఓవర్ లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ అవుటయ్యాడు. దానిని నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో కేవలం ఏడు పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న కోహ్లీ మరో 14 పరుగులు జోడించాడు. అనంతరం విజయానికి కావాల్సింది ఏడు పరుగులు, బంతులు ఆరున్నాయి. క్రీజులో జో రూట్ ఉన్నాడు.

అప్పటి వరకు ధాటిగా ఆడిన మోర్గాన్ అవుటయ్యాడు. రూట్ కు బుమ్రా సంధించిన ఇన్ స్వింగర్ మరింత లొపలికి చొచ్చుకొచ్చి అతని బ్యాటును రాసుకుంటూ కుడి తొడను తాకి, ఎడమ కాలిని ముద్దాడింది. వాస్తవానికి ఇది నాటౌట్ కానీ అంపైర్ షంషుద్దీన్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. చివరి ఓవర్ లో బుమ్రా అద్భుతంగా బంతులేసినప్పటికీ...రూట్ ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదని మోర్గాన్ వాపోతున్నాడు. అసలు టీ20ల్లో డీఆర్ఎస్ విధానం ఎందుకు అమల్లో లేదో అర్ధం కావడం లేదని, డీఆర్ఎస్ విధానం ఉండి ఉంటే రివ్యూకి వెళ్లేవారమని, తద్వారా విజయం సాధించి ఉండేవారమని మోర్గాన్ తెలిపాడు. మూడో టీ20లోపు అంపైర్ పై రిఫరీకి ఫిర్యాదు చేస్తామని తెలిపాడు. 

  • Loading...

More Telugu News