: మీ స్నేహితులు ఎక్కడ ఉన్నారో చెప్పే వాట్స‌ప్ కొత్త ఫీచ‌ర్‌


మీ ఫ్రెండ్ మీకు ఎంత‌దూరంలో ఉన్నారో తెలుసుకునేందుకు వీలుగా వాట్స‌ప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్ రానుంది. రియ‌ల్ టైమ్‌లో మీ ఫ్రెండ్స్‌ ఎక్క‌డ ఉన్నారో చెప్పే ఆ ఫీచ‌ర్‌ను రూపొందిచేందుకు వాట్స‌ప్ కృషి చేస్తోంద‌ని ట్విట్ట‌ర్‌లోని వాబీటా ఇన్ఫో పేర్కొంది. ఈ స‌రికొత్త‌ ఫీచ‌ర్ ఐవోఎస్ బీటా వ‌ర్ష‌న్ 2.17.3.28, ఆండ్రాయిడ్ 2.16.399, ఆపై వెర్ష‌న్ల‌లో అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది. యూజ‌ర్లు త‌మ‌కు న‌చ్చిన‌ట్లుగా ఆ ట్రాకింగ్‌ను ఒక‌టి, రెండు, ఐదు నిమిషాలు లేదా ఆల్‌వేస్ ఆన్‌లో పెట్టుకోవ‌చ్చ‌ని పేర్కొంది. వాట్స‌ప్ యూజ‌ర్లు ఎవరినైనా ఒక స‌మయానికి ఒక ప్ర‌దేశంలో క‌ల‌వాల‌నుకున్నపుడు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపింది. భార‌త్‌లో వాట్స‌ప్‌ను 16 కోట్ల మంది వినియోగిస్తున్నారు.

  • Loading...

More Telugu News