: లాస్యకు కాబోయే భర్త ఇతనే!
తెలుగు టీవీ పరిశ్రమలో సత్తా చాటి, వెండి తెరపైకి ఇటీవలే షిఫ్ట్ అయిన ప్రముఖ యాంకర్ లాస్య 'రాజా మీరు కేక' అనే సినిమాలో నటిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆసక్తికర ప్రకటన చేసింది. 'జీవితంలో ప్రత్యేక రోజు కోసం సిద్ధమవుతున్నందుకు ఆనందంగా ఉంది. నా సోల్ మెట్ తో ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రేమ విలువైంది. పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ఆసక్తితో కూడుకున్నది.' అంటూ డిజైనర్ ఈశ్వరీ తయారు చేసిన ఎంగేజ్ మెంట్ డ్రెస్ లో ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా తమ ఇద్దరి ముద్దుపేర్లతో కూడిన టాటూలను కూడా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. దీంతో ఇది సినిమా ప్రచారమా? అన్న అనుమానాలు రేగడంతో అభిమానులను మరింత గందరగోళానికి గురికాకుండా తన కాబోయే భర్త ఫోటోలను పోస్టు చేసింది. దీంతో జంట బాగుందంటూ అభిమానులు కితాబునిస్తున్నారు.