: బడ్జెట్ నేపథ్యంలో ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉండటంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని ప్రదర్శించారు. దీంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 27,850 వద్ద ముగిసింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 8,633కు పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
ఐడియా సెల్యులార్ (25.90%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (11.49%), రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (7.95%), భారతీ ఎయిర్ టెల్ (7.48%), బజాజ్ ఫైనాన్స్ (5.99%).
టాప్ లూజర్స్...
భారతీ ఇన్ఫ్రాటెల్ (-7.07%), సిటీ యూనియన్ బ్యాంక్ (-5.95%), కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (-3.33%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (-3.31%), సన్ ఫార్మా (-2.98%).