: జగన్ నీచ రాజకీయాలు మా జిల్లాలో సాగవు: వల్లభనేని వంశీ


ప్రతి విషయాన్ని రాజకీయం చేయడాన్ని వైసీపీ అధినేత జగన్ మానుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తన వెంట దళారి రైతులను జగన్ తీసుకొచ్చారని ఆరోపించారు. జగన్ నీచ రాజకీయాలు కృష్ణా జిల్లాలో సాగవని అన్నారు. పట్టిసీమ నీటితో ఈ జిల్లా రైతులు పంటలు పండించారని చెప్పారు.

కృష్ణా జిల్లా బాపులపాడులో నేడు జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మినుము రైతులతో ఆయన మాట్లాడారు. ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను అధికారులు పట్టించుకోవడం లేదని, అధికార పార్టీకి చెందిన రైతులకు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే, జగన్ పై వల్లభనేని వంశీ విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News