: అదే ఘటన ఇక్కడ జరిగుంటే.. కులాలకు కొమ్ముకాస్తున్నామని అనేవారు: లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి


రాజస్థాన్ లో 'పద్మావతి' సినిమా షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనపై పలు హిందూ గ్రూపులు భన్సాలీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా ఈ ఘటనపై ఇంతవరకు స్పందించలేదు.

ఈ నేపథ్యంలో భన్సాలీకి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మద్దతుగా నిలిచారు. బీహార్ వచ్చి షూటింగ్ జరుపుకోవాలని... ఎలాంటి సమస్య తలెత్తకుండా, తాము పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని తేజస్వి అన్నారు. బీహార్ అభివృద్ధి దిశగా పయనిస్తోందని... బాలీవుడ్ సినిమాలు నిర్మించేందుకు అనువుగా ఉంటుందని ట్వీట్ చేశారు. మరోవైపు... భన్సాలీపై జరిగిన దాడి బీహార్ లో జరిగి ఉంటే, ఇక్కడ ఆటవిక పాలన సాగుతోందని, కులాలకు కొమ్ముకాస్తున్నారంటూ పలు రకాలుగా విమర్శించేవారని అన్నారు.

  • Loading...

More Telugu News