: విశాఖపట్టణం లేకుండా జోన్ ఏర్పాటు...కేంద్రం కుట్ర: విజయసాయిరెడ్డి
విశాఖపట్టణం కేంద్రంగా రాజుకుంటున్న ప్రత్యేకహోదా ఉద్యమాలను నిలువరించేందుకు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోందని, అయితే దీని వెనుక అతి పెద్ద కుట్రకు బీజేపీ, టీడీపీలు తెరలేపాయని వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. గుంతకల్లు, విజయవాడ, కాకినాడ కేంద్రంగా ఏపీకి మరో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోందని, ఈ జోన్ లోకి విశాఖపట్టణం రాకుండా ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. విశాఖపట్టణం లేకపోతే భువనేశ్వర్ జోన్ నిర్వీర్యమవుతుందని వారు ఆరోపిస్తున్నారని, రాష్ట్రంలో ఉన్న వైజాగ్ ను మినహాయించి జోన్ ఎలా ఏర్పాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ కుట్రపై వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఆయన తెలిపారు.