: ట్రంప్ దారిలోనే పయనిస్తున్న కేజ్రీవాల్


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దారిలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెళుతున్నట్టున్నారు. ట్రంప్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో కేజ్రీ కూడా మీడియాపై విరుచుకుపడుతున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం కష్టమేనంటూ మీడియా సర్వేల్లో తేలడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ సర్వేలు, వార్తలన్నీ నకిలీ అని, డబ్బు తీసుకుని రాస్తున్నవని విమర్శించారు. కొందరు జర్నలిస్టులు డబ్బును ఆశించి పనిచేస్తున్నారని... డబ్బులు తీసుకుంటేనే ఇలాంటి సర్వే ఫలితాలు వస్తాయని కేజ్రీ అన్నారు. ఓ సర్వేలో పంజాబ్ ఎన్నికల్లో ఆప్ కు కేవలం 14 నుంచి 19 సీట్లు మాత్రమే వస్తాయని... అకాళీదళ్ కు 50 నుంచి 55, కాంగ్రెస్ కు 45 నుంచి 50 వరకు సీట్లు వస్తాయని తేలింది. దీంతో, మీడియాపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు.

  • Loading...

More Telugu News