: చిదంబరంకు మాట్లాడే అర్హత కూడా లేదు: టీఆర్ఎస్ నేత పల్లా


కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంపై టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత చిదంబరంకు ఉందా? అని ప్రశ్నించారు. అసలు రాజకీయ వ్యభిచారానికి తెర లేపిందే కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయడం లేదని చిదంబరం వ్యాఖ్యానించడం అర్థరహితమని అన్నారు. రూ. 24వేల కోట్ల మేర రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసిన సంగతి ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన చిదంబరం తప్పుడు లెక్కలు చెప్పడం దారుణమని అన్నారు.

  • Loading...

More Telugu News