: దేవినేని ఉమకు లేఖ రాసిన హరీష్ రావు
ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. పులిచింతల రిజర్వాయర్ లో క్రస్ట్ లెవెల్ వరకు నీటి మట్టాన్ని ఉంచాలని లేఖలో హరీష్ కోరారు. క్రస్ట్ లెవెల్ వరకు నీరు ఉంటే... బ్యాక్ వాటర్ ను ఉపయోగించుకుని నడుస్తున్న 8 లిఫ్టుల ద్వారా ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. క్రస్ట్ లెవెల్ వరకు నీరు లేకపోతే ఈ లిఫ్టుల ద్వారా నీటిని ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. హరీష్ లేఖకు దేవినేని ఉమా ఇంకా స్పందించాల్సి ఉంది.