: విడాకులు తీసుకున్నంత మాత్రాన అలాంటి డ్రెస్సులు వేసుకోకూడదా?: అమలాపాల్


దర్శకుడు విజయ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న హీరోయిన్ అమలాపాల్... అతడి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో అమలాపాల్ ధరిస్తున్న దుస్తులపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత హాట్ హాట్ డ్రెస్ లు ధరిస్తోందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తన డ్రెస్ గురించి మాట్లాడుతున్న వారిపై అమలాపాల్ మండిపడింది. ఒకప్పుడు తనను ఫ్యాషన్ ఐకాన్ అంటూ పొగిడారని, ఇప్పుడేమో విమర్శిస్తున్నారని మండిపడింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన మోడ్రన్ డ్రెస్ లు వేసుకోకూడదా? అని ప్రశ్నించింది. తన శరీరానికి సరిపోయే డ్రెస్ లను వేసుకుంటానని చెప్పింది. గ్లామర్ గా కనిపించకపోతే... విడాకులు తీసుకుని బాధపడుతోందంటూ విమర్శిస్తారని మండిపడింది.

  • Loading...

More Telugu News