: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రికార్డును చంద్రబాబు బ్రేక్ చేశారు: వైఎస్సార్సీపీ నేత బుగ్గన


ఎంవోయుల విషయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రికార్డును సీఎం చంద్రబాబు బ్రేక్ చేశారని పీఏసీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక రోజులో రూ.6.50 లక్షల కోట్ల ఎంవోయూలు చేస్తే, ఏపీ సీఎం చంద్రబాబు ఒక్క రోజులో రూ.10.50 లక్షల కోట్ల ఎంవోయూలు చేశారని అన్నారు. రెండేళ్లలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న చంద్రబాబు అంకెల గారడీ చేస్తున్నారని, ఆయా పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ పై ఎంవోయూలు ఎందుకో అర్థం కాదని, అదనంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను అమ్ముకోలేని అవస్థ ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News