: కోహ్లీ నాకిదే చెప్పాడు.. అదే చేశాను!: బుమ్రా


నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ కేవలం ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుకు కారణం, బుమ్రా చివరి ఓవర్ లో సంధించిన బంతుల్లో వైవిధ్యమే. అయితే సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా సిక్సర్ సమర్పించుకున్న దశలో కేవలం రెండు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడం వెనుక కోహ్లీ మాటలు దాగి ఉన్నాయని బుమ్రా చెప్పాడు.

చివరి ఓవర్ లో బౌలింగ్ చేసేందుకు బంతినందుకున్న బుమ్రా దగ్గరకొచ్చిన కోహ్లీ...'నీ ప్రతిభను నువ్వు నమ్ముకో. నీలో దాగి ఉన్న స్కిల్స్ ను బయటకు తీసేందుకు యత్నించు. నీ బౌలింగ్ లో సిక్స్ కొట్టినా ఫర్వాలేదు. అక్కడితో ప్రపంచం ఏమీ ఆగిపోదు. రేపు అనేది మళ్లీ  ఉంటుంది' అని చెప్పాడు. దీంతో సమయస్పూర్తిగా బౌలింగ్ చేసిన బుమ్రా చివరి ఓవర్ లో విజయానికి ఏడు పరుగులు అవసరం కాగా, రెండు పరుగలే ఇచ్చి, రెండు వికెట్లు తీసి కెప్టెన్ విశ్వాసాన్ని చూరగొన్నాడు. గతంలో చివరి ఓవర్లలో బౌలింగ్ చేసిన అనుభవం తనకు కలిసి వచ్చిందని బుమ్రా చెప్పాడు. 

  • Loading...

More Telugu News