: యాంకర్ లాస్య పెళ్లి కబురు... ఇది నిజమేనా ?


తెలుగు టీవీ పరిశ్రమలో సత్తా చాటి, వెండి తెరపైకి ఇటీవలే షిఫ్ట్ అయిన ప్రముఖ యాంకర్ లాస్య 'రాజా మీరు కేక' అనే సినిమాలో నటిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆసక్తికర ప్రకటన చేసింది. 'జీవితంలో ప్రత్యేక రోజు కోసం సిద్ధమవుతున్నందుకు ఆనందంగా ఉంది. నా సోల్ మెట్ తో ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌ గా ఉంది. ప్రేమ విలువైంది. పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్మెంట్ ఎంతో ఆసక్తితో కూడుకున్నది.' అంటూ డిజైనర్ ఈశ్వరీ తయారు చేసిన ఎంగేజ్ మెంట్ డ్రెస్ లో ఉన్న ఫోటోను లాస్య తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసింది.

అయితే ఇది నిజం ఎంగేజ్ మెంటా? లేక సినిమా కోసం జరుగుతున్న ఎంగేజ్ మెంటా? అన్న విషయం తెలియడం లేదు. ఎందుకంటే తన ప్రియుడి పేరును లాస్య వెల్లడించకుండా సీక్రెట్ గా ఉంచడమే కారణం. గతంలో లాస్య సహ యాంకర్ తో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం మరో పోస్టు చేసిన లాస్య అందులో కంకణాలు కట్టుకున్న రెండు చేతుల ఫోటో పెట్టింది. ఆ చేతులపై చిన్ని. మంజు అన్న టాటూలున్నాయి. ఈ లెక్కన లాస్య ముద్దు పేరు చిన్ని అయితే, ఆమెకు కాబోయే భర్తపేరు మంజు అయ్యే అవకాశం ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. ఏమైనా, ఇది తన సినిమా ప్రమోషన్లో భాగం కావచ్చని కూడా అంటున్నారు. 

  • Loading...

More Telugu News