: విలీనం కానున్న ఐడియా-వొడాఫోన్?


భారత్ కు చెందిన ‘ఐడియా’తో వొడాఫోన్ సంస్థ విలీనం కానున్న నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని వొడాఫోన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయ మార్కెట్లో నెలకొన్న తీవ్ర పోటీని తట్టుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ‘వొడాఫోన్’ ఇండియాను విడగొట్టేందుకు ‘ఐడియా’ జారీ చేసే కొత్త వాటాలు తదితర అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు ఈ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన ప్రభావంతో వొడాఫోన్ సంస్థ షేర్లు 3.5 శాతం పెరిగాయి. 

  • Loading...

More Telugu News