: చెలరేగిన మార్కస్ 146 పరుగులు చేసినా.. విజయం ముంగిట చతికిలబడ్డ ఆస్ట్రేలియా


న్యూజిలాండ్ తో జరుగుతున్న చాపెల్ - హ్యాడ్లీ సిరీస్ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు పోరాడి ఓడింది. తన రెండో వన్డే ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ అద్భుత పోరాట పటిమను చూపించి 117 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సులతో రెచ్చిపోయి 146 పరుగులు చేసినా జట్టు విజయతీరాన్ని మాత్రం తాకలేకపోయింది. ఆక్లాండ్ లో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 286 పరుగులు చేయగా, 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు లక్ష్యానికి ఆరు పరుగుల దూరంలో నిలిచిపోయింది. 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మార్కస్ ఆదుకుని బౌండరీలే లక్ష్యంగా చెలరేగాడు. మరోవైపు నుంచి మార్కస్ కు సరైన సహకారాన్ని అందించే వారు కరవైన వేళ, తానే అన్నీ అయి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, తన టీమును దాదాపు గెలిపించేసినంత పని చేశాడు. అయితే, 47వ ఓవర్ లో హజల్ రన్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా ఓటమి పాలై, మార్కస్ శ్రమ వృథా అయింది.

  • Loading...

More Telugu News