: విభేదాలు అభిమానుల మధ్యే కాని.. నందమూరి, మెగా హీరోల మధ్య కాదని చాటి చెప్పిన ఎన్టీఆర్!
నందమూరి వంశ హీరోలు, మెగా హీరోల అభిమానుల మధ్య పెద్ద యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాల అభిమానులు చెలరేగిపోయారు. అయితే, ఈ విభేదాలన్నీ కేవలం అభిమానుల మధ్యేనని, హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాటి చెప్పాడు. హీరో సాయి ధరమ్ తేజ్ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ కు హాజరైన ఎన్టీఆర్... ధరమ్ తేజ్ పై తొలి క్లాప్ కొట్టాడు. తామంతా ఒకే కుటుంబమని... తమ మధ్య విభేదాలు లేవనే విషయాన్ని అందరికీ తెలియజేశాడు. బీవీఎస్ రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'జవాన్' అనే పేరును ఖరారు చేశారు. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది.