jagan: ఇక్కడి నుంచే విమానం ఎక్కుతారు.. కానీ రైతుల గురించి పట్టించుకోరు: చంద్రబాబుపై జగన్ విమర్శలు
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి కష్టాలను పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన కృష్ణాజిల్లా గన్నవరం నియోజక వర్గంలో బొమ్మలూరు, బాపులపాడులో పర్యటించారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచే విమానం ఎక్కుతారని, కానీ ఇక్కడి రైతుల గురించి పట్టించుకోరని అన్నారు.
రైతులకు రుణాలు దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారికి రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ విమర్శించారు. జిల్లాలో మినుము పంట పూర్తిగా ఎండిపోయిందని చెప్పారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే కృష్ణా డెల్టాలో కరవు వచ్చిందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం కనీసం సాగునీటిని అందివ్వలేకపోతుందని చెప్పారు.